థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ‘వరల్డ్ హిందూ కాంగ్రెస్ 2023’లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ పరిషత్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను బెదిరించే సమస్యలు మరియు సవాళ్లపై మేధోమథనం చేయడానికి ఆలోచనాపరులు, కార్యకర్తలు, నాయకులు సమావేశం అవుతారు. వాటి పరిష్కారానికి కూడా చర్చలు జరుతారు. ఇక, నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచ హిందూ కాంగ్రెస్ (WHC) తన మూడవ ఎడిషన్ యొక్క థీమ్ ‘జయస్య ఆయతనం ధర్మం’ను రూపొందించింది.
Read Also: Eknath Shinde : ఏక్ నాథ్ షిండే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఊపందుకున్న రాజీనామా టాక్
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. సకల సౌఖ్యాలు పొందినా ప్రపంచం సంతృప్తి చెందడం లేదని పేర్కొన్నారు. నేటి ప్రపంచం సరైన దారిలో లేదని అన్నారు. 2000 సంవత్సరాలుగా శాంతి, సంతోషం తీసుకురావడానికి ప్రపంచం చాలా ప్రయోగాలు చేసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందరూ కూడా భౌతికవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానాన్ని ఉపయోగించడంతో పాటు వివిధ మతాలను ప్రయత్నించి తమ శ్రేయస్సు పొందారు.. కానీ ఇప్పటికీ భౌతిక సుఖాలు ఉన్నప్పటికీ ప్రజలు సంతోషంగా లేరన్నారు.
Read Also: Misuse of POCSO Act: లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తప్పుడు ఆరోపణ .. మహిళకు లక్ష జరిమాన
ఇక, కోవిడ్ తర్వాత ప్రపంచం పునరాలోచించడం ప్రారంభించింది అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రపంచ దేశాలకు ఓ మార్గాన్ని చూపుతుందని ఆయన వ్యాఖ్యనించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమని, అందరినీ ఆర్యులుగా తీర్చిదిద్దుతామని, అదే సంస్కృతి అని ఆయన అన్నారు. భౌతిక ఆనందాన్ని పొందడానికి ప్రజలు పరస్పరం పోరాడంతో పాటు ఆధిపత్యం చెలాయించటానికి ప్రయత్నిస్తారు.. మేము కూడా దాన్ని అనుభవించామన్నారు. అయితే, కొన్ని నెలల క్రితం ప్రపంచ ముస్లిం కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి భారతదేశానికి వచ్చి అక్కడ తన ప్రసంగాలలో ప్రపంచంలో శాంతి, సామరస్యం కావాలంటే భారతదేశంతో అనుబంధం అవసరమని చెప్పారు అనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుర్తు చేశారు. కావున అది మన కర్తవ్యము. హిందూ సమాజం ఉనికిలోకి రావడానికి ఇదే కారణమన్నారు.
#WATCH | Addressing the 'World Hindu Congress 2023' in Bangkok, Thailand, RSS Chief Mohan Bhagwat says, "The world is one family and we will make everybody 'Arya' that is culture…To acquire possession of all means of material happiness, people try to fight and dominate each… pic.twitter.com/na8KZRulbU
— ANI (@ANI) November 24, 2023