నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూ. 43 లక్షల విలువ చేసే అల్ఫాజూలం,. క్లోరోహైడ్రేట్ ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్టిఎఫ్ టీం, టీం లీడర్ ప్రదీప్ రావు కు వచ్చిన సమాచారం మేరకు నిర్మల్ లోని ద్వారకా నగర్ లో గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 3.3 కిలోల అల్ఫాజూలం, శాంతినగర్ లో ఒక గోదాం లో నిల్వ చేసిన 728 క్లోరోహైడ్రేట్ నిలువలను ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2016 నుంచి 24 వరకు నిందితుడుగా ఉన్న గంధం శ్రీనివాస్ గౌడ్ కి సోలాపూర్ శీను ఎలియాస్ భాయ్ అల్ఫాజూలాన్ని అల్ఫా సోలంను, రాజస్థాన్ కు చెందినటువంటి రూప్ సింగ్ అనే వ్యక్తి క్లోరోహైడ్రేడ్ ను గత కొంతకాలంగా సప్లై చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆల్ఫాజూలం, క్లోరోహైడ్రేట్ కల్తీ కల్తీ కళ్ళు తయారీకి వినియోగిస్తారని, పట్టుబడిన శ్రీనివాస్ గౌడ్ కల్తీకల్లు వ్యాపారం చేయడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కల్తీకల్లు తయారు చేసే వారికి అల్పాసోలం క్లోరోహైడ్రేడ్ ను సరఫరా చేస్తాడని పోలీసుల విచారణలో తేలినట్లు పేర్కొన్నారు.