Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల తరుపున కమలా హారిస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నవంబర్‌లో అగ్రరాజ్య అధినేతను ఎన్నుకోవడానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటు, ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ ‘‘ఆటోమేటెడ్ మెసేజ్’’కి భారతదేశ యూజర్ ఇచ్చిన సమాధానం సమాధానం తెగవైరల్ అవుతోంది.
Read Also: Pawan Kalyan: అన్నప్రాశనలో కత్తి పట్టుకున్న పవన్ కళ్యాణ్.. అంజనమ్మ పంచుకున్న విశేషాలివే!
ట్రంప్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రోషన్ రాయ్ అనే వ్యక్తిని ఉద్దేశిస్తూ ట్వీట్ వచ్చింది. ‘‘నేను మీకు నార్త్ కరోలినా ఎన్నికల అప్‌డేట్స్ పంపుతాను. నవంబర్ 5లోపు మీరు డొనాల్డ్ జే. ట్రంప్‌కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్ధారించుకోండి.’’ అని ట్వీట్ పేర్కొంది. అయితే, దీని రోషన్ రాయ్ స్పందిస్తూ.. ‘‘థాంక్స్, కానీ మీరు ఎప్పటికీ నాకు ప్రెసిడెంట్ కాలేరు. కమలా హారిస్ కూడా ప్రెసిడెంట్ కాదు. నిజానిని నేను భారతదేశానికి చెందినవాడిని’’ అని ఫన్నీగా కామెంట్ చేశారు. రాయ్ ఇచ్చిన ఈ రిఫ్లై ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్ల దృష్టిని ఆకర్షించింది. ట్రంప్ ఆటోమేడెట్ మెసేజింగ్ సిస్టమ్ అమెరికా సరిహద్దులను దాటి ఊహించని విధంగా రీచ్ అవుతోందని అనుకుంటున్నారు.
I’ll send you IMPORTANT ELECTION UPDATES for North Carolina. Make sure you are ready to VOTE FOR DONALD J. TRUMP by November 5th.
Reply #stop to opt-out.
— Donald J. Trump (@realDonaldTrump) October 3, 2024
Thanks, but you will never be my President.
Kamala Harris will never be my President either.
Actually I am from India 😂 https://t.co/gKbkNYa18P
— Roshan Rai (@RoshanKrRaii) October 3, 2024