జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు ట్విటర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. జైపూర్-ముంబై ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్ కు చెందిన సయ్యద్ సయూద్దీన్ మృతి చెందాడు