ఆస్ట్రేలియా టూర్‌లో బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ రెండింటిలోనూ విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ప్రస్తుతం కష్టంగా ఉంది. రోహిత్ శర్మ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో.. రోహిత్ తన కెరీర్ ను కాపాడుకోవడానికి నరకయాతన పడుతున్నాడు. తన ఫామ్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో రోహిత్ శర్మ దానిపై కసరత్తు ప్రారంభించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. అతని బ్యాటింగ్‌పై ప్రశ్నలు తలెత్తాయి. మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే అతని ఫ్యాన్స్ రిటైర్మెంట్ ప్రకటించద్దని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఏదేమైనాప్పటికీ.. రిటైర్మెంట్ ప్రకటించలేదు.
Sankranthi Celebrations: కోడిపందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్న అతిధులు..
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న రోహిత్.. ఇప్పుడు అన్నీ పనులు వదిలేసి మైదానంలోకి దిగి మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. రోహిత్ వాంఖడే స్టేడియంలో ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో ప్రాక్టీస్ చేశాడు. ఈ సమయంలో అతను సెంటర్ వికెట్‌పై బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అతనితో పాటు టీమిండియా మాజీ ఆటగాడు అజింక్య రహానే కూడా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు. రోహిత్ తన బ్లూ కలర్ కారులో వాంఖడే స్టేడియానికి వచ్చాడు. రోహిత్ వైట్ డ్రస్‌తో బ్యాగ్, కిట్‌బ్యాగ్‌తో కనిపించాడు. ఆ సమయంలో అక్కడి చేరుకున్న తన ఫ్యాన్స్ ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
రోహిత్ ఇటీవల బీసీసీఐ సమావేశానికి హాజరయ్యాడు. ఆ సమావేశంలో జట్టు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఉన్నారు. ఈ సమావేశంలో దేశవాళీ క్రికెట్ ఆడే ఆటగాళ్లపై దృష్టి సారించారు. అయితే.. రోహిత్ శర్మ ముంబై జట్టుతో ప్రాక్టీస్ చేసాడు కాబట్టి.. అతను రంజీ ట్రోఫీ సెకండ్ ఫేజ్‌లో ఆడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ ఆడతాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే అతను మళ్లీ ఫామ్‌లోకి రావడంపై ఫోకస్ పెట్టాడు.