ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. గత పదేళ్ళలో మసిగుండ్లపల్లి గ్రామం చాలా మారిందని.. రోడ్డు, డ్రైనేజీలతో పాటు గ్రామం అభివృద్ధి చెందిందని పార్టీ మారిన నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలకు అభివృద్ధికి ఆకర్షితులయ్యే పార్టీలో చేరుతున్నట్లు మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతృత్వంలోని ఎన్‌డీఏలో సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) చేరనుంది. ఎన్‌డిఎలో చేరుతున్నట్లు ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భార్ ప్రకటించారు.