Hindu Shiv Bhavani Sena: హిందూ దేవుళ్లపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో శివ భవానీ సేన అనే హిందూ సంస్థ సదరు ఆర్జేడీ ఎమ్మెల్యే నాలుక కోసేస్తే 10 లక్షల రూపాయల రివార్డును అందజేస్తామంటూ పోస్టర్‌లను అంటించింది. దీనిపై ఎమ్మెల్యే బహదూర్ సింగ్ స్పందిస్తూ.. శివ భవానీ సేనపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ డీజీపీకి లేఖ రాశారు.
Read Also: Sasivadane Teaser: ఒక అందమైన ప్రేమ… కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది
గత కొద్ది రోజుల క్రితం ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ పేరుతో పలు గోడలపై కొన్ని పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయి. వాటిలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే చెప్పిన మాటలను ఉదహరిస్తూ.. ‘ఆలయం అంటే మానసిక బానిసత్వానికి మార్గం.. స్కూల్ అంటే జీవితంలో వెలుగుల మార్గం అని రాసి ఉంది. ఈ గుడి గంట మోగిస్తే మూఢనమ్మకాలు, మూర్ఖత్వం, అజ్ఞానం వైపు అడుగులు వేస్తాం.. బడి గంట మోగిస్తే హేతుబద్ధమైన జ్ఞానం, శాస్త్రీయత, వెలుగుల వైపు పయనిస్తారు.. మీరు ఏ దిశలో వెళ్తారో నిర్ణయించుకోండి అని అందులో రాసివుంది.
Read Also: YS Sharmila: మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్నా.. సంతోషంగా ఉంది
అయితే, ఆ పోస్టర్‌లో ఆర్‌జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు మాజీ సీఎం రబ్రీ దేవి ఫొటోలు ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ గురించి పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.. అయితే హిందూ శివ భవానీ సేన ఈ పోస్టర్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సంస్థ అధ్యక్షుడు లవ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ వ్యాఖ్యలు చేశారు.. అతని నాలుకను తెగ్గోసినవారికి 10 లక్షల రూపాయలను బహుమతిగా ఇస్తామని తెలిపారు.