ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే మొదటి రోజుల కన్నా ఫస్ట్ మండే కలెక్షన్స్ చాలా ముఖ్యం. బ్రేకింగ్ డే ఆర్ మేకింగ్ డే లా సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తుంది ఫస్ట్ మండే. వీకెండ్స్ ఎలా అయినా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే ప్రతి సినిమా చూస్తారు, మండే రోజున కాలేజ్ కి వెళ్లే యూత్ ని ఆపగలిగితే చాలు సినిమా సూపర్ హిట్ అయినట్లే. స్టూడెంట్స్ తో మండే బంక్ కొట్టించగలిగే సినిమా ఈ వీక్ మొత్తం స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఇలా ఇప్పటికే కామెడీ జానర్ లో మ్యాడ్ మూవీ, యాక్షన్ జానర్ లో సలార్, ఎమోషనల్ డ్రామా జానర్ లో హాయ్ నాన్న సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు లవ్ స్టోరీ జానర్ టైమ్ వచ్చేసింది. ఒక మంచి ప్రేమ కథకి యూత్ ఇచ్చే సపోర్ట్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి కూడా ఉండదు. సరైన ప్రేమ కథ పడితే యూత్ థియేటర్స్ కి క్యూ కడతారు. ఇలాంటి ఇంపాక్ట్ ని ఇవ్వడానికే వస్తుంది శశివదనే సినిమా. డీజే పిల్లా సాంగ్ తో యూత్ కి రీచ్ అయిన శశివదనే సినిమా ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది. రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటించిన ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ ప్రొడక్షన్ లో… సాయి మోహన్ ఉబ్బెన శశివదనే సినిమాని డైరెక్ట్ చేసాడు. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేసారు.
స్వఛ్ఛమైన పల్లెటూరి వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఓపెన్ అయిన టీజర్… రక్షిత్ హీరోయిన్ చుట్టూ తిరిగే ఎపిసోడ్స్ తో బ్యూటిఫుల్ గా సాగింది. టీజర్ లో “గడిచే కాలంతో ఈ నేలపై నడిచే నా ప్రతి అడుగు ఇకపై నీతోనే… రైట్ హ్యాండ్ తో ప్రామిస్” అంటూ హీరో చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. మెయిన్ కాస్ట్ పైన డిజైన్ చేసిన మాంటేజస్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. కోమలీ ప్రసాద్ లంగావోణీల్లో గోదావరి జిల్లాల్లో ఉండే అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. ఈ ఇద్దరి పెయిర్ శశివదనే సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. టీజర్ లో మరో ఇంప్రెసివ్ ఎలిమెంట్… శరవణన్ వాసుదేవ్ ఇచ్చిన మ్యూజిక్ టీజర్ ని మరింత స్పెషల్ గా మార్చింది. 02:11 నిమిషాల నిడివితో కట్ చేసిన టీజర్ సరదాగా సాగుతూనే సడన్ గా ఎండ్ షాట్ లో కొత్త టర్న్ తీసుకుంది. ఈ ఒక్క షాట్ తో శశివదనే రెగ్యులర్ గా చూసే హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ కాదేమో అనే డౌట్ వచ్చేలా చేసింది. ఈ షాట్ లో రక్షిత్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా టీజర్ శశివదనే సినిమాపై అంచనాలని పెంచింది. ట్రైలర్ కూడా ఇలానే ఉంటే తెలుగులో చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ పడినట్లే.