Revanth Reddy : 5 అంశాలతో యూత్ డిక్లరేషన్.. వివరాలు వెల్లడించిన రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరూరల్ నగర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సంఘర్షణ సభకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఆమెతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా.. కాకతీయ యూనివర్సిటీలు… కేవలం విద్యాలయాలు కాదని, సామాజిక చైతన్యం కి వేదికలన్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. సీరియస్ విషయం పై మీటింగ్ జరుగుతుందన్న రేవంత్.. ప్రియాంకా గాంధీ మనకు అండగా నిలవడానికి వచ్చారన్నారు. ప్రియాంక నేతృత్వంలో.. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
Also Read : Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్.. థియేటర్ లో బ్లాస్టే
Also Read
అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తొలి డిక్లరేషన్ చేస్తున్నాం. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. అమరవీరుల త్యాగాలను భవిష్యత్ తరాలు కూడా తెలుసుకునేలా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ముందుకు తీసుకెళుతుంది. అమరవీరుల కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తాం. ఐదు శీర్షికల ద్వారా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ తీసుకువస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీనే. మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. జూన్ 2 నాటికి ఉద్యోగ ఖాళీల వివరాలు సేకరించి జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం. నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబరు 17 నాటికి నియామక పత్రాలు లబ్దిదారులకు అందజేస్తాం. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4 వేల భృతి అందజేస్తాం. కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చవటలను, దద్దమ్మలను సభ్యులుగా చేశాడు. టీఎస్ పీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. మేం అధికారంలోకి వస్తే టీఎస్ పీఎస్సీని బలోపేతం చేస్తాం. యూపీఎస్సీ తరహాలో పారదర్శకంగా నియామకాలు చేపడతాం. కేంద్రీయ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానం తీసుకువస్తాం.
Also Read : Karnataka Polls: సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం.. ఈసీకి ఫిర్యాదు
ఏడు జోన్లలో ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చర్యలు తీసుకుంటాం. నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తాం. విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడమే కాకుండా, పాత బకాయిలన్నీ చెల్లిస్తాం. గల్ఫ్ వెళ్లిన కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం. మోసం చేసిన ఏజెంట్లను కఠినంగా శిక్షిస్తాం. ఆర్టీసీ కార్మికులు, పోలీసుల పిల్లల కోసం రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం. ఒకటి వరంగల్ లో, రెండోది హైదరాబాదులో ఏర్పాటు చేసి వారి పిల్లలకు 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అన్నింటి కంటే ముఖ్యమైనది, ప్రియాంక గాంధీ కోరుకుంటున్న యువ మహిళా సాధికారత. యువతులు ఎక్కడికైనా వెళ్లాలంటే తండ్రి మీదనో, అన్న మీదనో, తమ్ముడి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే, రాష్ట్రంలో చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీని ఉచితంగా అందిస్తాం. తద్వారా ఎవరిపైనా ఆధారపడకుండా విద్యార్థునులు స్వతంత్రంగా కాలేజీలకు వెళ్లి చదువుకోగలరని ఆశిస్తున్నాం. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుతో గ్రామీణ యువతకు చేయూతగా అందిస్తాం. యువత భవిష్యత్తే కాంగ్రెస్ నినాదం… అమరుల ఆశయ సాధనే విధానం.’ అని ఆయన యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!