Adipurush Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో జూన్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎన్ని వివాదాల బారిన పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను ఏఎంబి లో స్పెషల్ స్క్రీనింగ్ వేసిన విషయం తెల్సిందే. ఈ ట్రైలర్ స్క్రీనింగ్ కోసమే బాలీవుడ్ మొత్తం ఏఎంబిలో వాలిపోయింది. ప్రభాస్ అభిమానులు ఏఎంబి లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక అభిమానులతో కలిసి ఆదిపురుష్ చిత్ర బృందం ట్రైలర్ ను వీక్షించింది. టీజర్ కు వచ్చిన నెగెటివిటి.. ట్రైలర్ కు వస్తుందేమో అని భయపడి మేకర్స్ చేయాల్సిన మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే 3డీ లో ట్రైలర్ ను చూపించారని టాక్.
Dead Pixels Trailer: దానికోసం పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన నిహారిక
ఇక ట్రైలర్ టాక్ అదిరిపోతోంది. 3డీ లో ట్రైలర్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ట్రైలర్ ను ఫోన్ ల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలను బట్టి రాముడిగా ప్రభాస్ ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. మూడు నిమిషాలకన్నా పైనే ట్రైలర్ ను కట్ చేశారు. సీతను రావణాసురుడు కిడ్నాప్ చేయడంతో మొదలైన ట్రైలర్.. రావణాసురుడును రాముడు అంతం చేయడంతో ముగుస్తుంది. రామాయణంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని చూపించారు. “ప్రాణాల కన్నా మర్యాదనే ప్రియమైనదా “..? అని లక్ష్మణుడు అడిగిన ప్రశ్నకు.. ” నాకు ప్రాణాలకన్నా మర్యాదనే అధిక ప్రియమైనది” అని రాముడు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇంకా శబరి వద్ద రాముడు పళ్ళు తినడం, ఆంజనేయుడు.. సంజీవిని పర్వతాన్ని ఎత్తడం లాంటి సీన్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ తో అభిమానులను మెప్పించాడు డైరెక్టర్ ఓం రౌత్. ఇక ట్రైలర్ అనంతరం అందరూ జై శ్రీరామ్ నినాదాలతో ఏఎంబి దద్దరిల్లిపోయింది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.