హాత్ సే హోత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన నేడు మాట్లాడుతూ.. ప్రజలను హింసించడానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గెలిచారా అని ప్రశ్నించారు. జలపతి రెడ్డి మృతికి కారణమైన న్యాయవాదిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న కవిత అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు స్పందించలేదని ఆయన అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ లు వీధి నాటకాలు ఆడుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.
Also Read : USA: క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్నవారికి మిస్టరీ వ్యాధి.. 300 మందికి పైగా అనారోగ్యం..
దేశంలో అదానీపై చర్చ జరగకుండా, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా లిక్కర్ కేసును తెరమీదకి తెచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు ముందుగా జంతర్ మంతర్ వద్ద ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలన్నారు. బండి సంజయ్ కరీంనగర్‌లో గంగుల కమలాకర్ పై పోటీ చేస్తావా అని ఆయన సవాల్ విసిరారు.
Also Read : Anurag Thakur : ప్రజాస్వామ్యం గురించి మాకు పాఠాలు చెప్పక్కర్లేదు.. విదేశీ మీడియాపై కేంద్రమంత్రి ఫైర్
ఈ క్రమంలోనే.. నర్సింగాపూర్ లో ఆత్మహత్య చేసుకుని మరణించిన రైతు జలపతి రెడ్డి కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. జలపతి రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన రేవంత్.. కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. నర్సింగపూర్ గ్రామాన్ని రిక్రియేషన్ జోన్ నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జలపతి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన న్యాయవాది బెయిల్‌ను రద్దు చేసి.. అతన్ని అరెస్ట్ చేయాలన్న రేవంత్ అన్నారు.