People Fall Sick With Mysterious Illness On A US Cruise Ship: అమెరికాకు చెందిన ఓ క్రూయిజ్ షిప్ లో ఏకంగా 300 మంది అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతున్నారు. మిస్టరీ వ్యాధి బారిన పడినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) నివేదించింది. ప్రిన్సెస్ క్రూయిసెస్ రూబీ ప్రిన్సెస్ షిప్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు టెక్సాస్ నుంచి మెక్సికోకు ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజ్ షిప్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Anurag Thakur : ప్రజాస్వామ్యం గురించి మాకు పాఠాలు చెప్పక్కర్లేదు.. విదేశీ మీడియాపై కేంద్రమంత్రి ఫైర్
ఓడలో మొత్తం 2,881 మంది ప్రయాణికుల్లో 284 మంది అనారోగ్యం పాలయ్యారు. 1,159 మంది సిబ్బందిలో 34 మంది అంతుచిక్కని అనారోగ్యం బారినపడ్డారు. మంగళవారం నాటికి మొత్తంగా ఓడలోని 13 శాతం మంది వాంతులు, విరేచనాల లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ అనారోగ్యానికి కారణం ఇప్పటి వరకు తెలియలేదు. ఓడ టెక్సాస్ లోని గాల్వెస్టన్ నౌకాశ్రయానికి చేరుకున్నప్పుడు ఎపిడెమియాలజిస్టులు, పర్యావరణ ఆరోగ్య అధికారులు నౌకను పరిశీలించారు. ఓడలోని వ్యాధి ప్రారంభం అయిప్పటి నుంచి నౌకా సిబ్బంది తరుచుగా శానిటైజేషన్, డిస్ఇన్ఫెక్ట్ మందులను వాడి శుభ్రం చేయడం ప్రారంభించారు. సీడీఎస్ పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.
రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ గతంలో కూడా వార్తల్లో నిలిచింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో 2020లో క్రూయిజ్ షిప్ లో వందలాది మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలోని ఓ ఓడరేవులో దీన్ని నిలిపివేశారు. ఇటీవల కాలంలో సీడీఎస్ క్రూయిజ్ షిప్ లలో కోవిడ్ వ్యాప్తిని పర్యవేక్షించింది.