తెలంగాణలో ఎన్నికలు వేడెక్కాయి. ఆయా పార్టీలు ప్రచారాలు జోరుగా సాగిస్తున్నాయి. ఇవాళ నిర్మల్‌లో ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించి బొందపెట్టడానికి వేలాదిగా తరలి వచ్చిన మీకు అభినందనలు అని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అందుకే జెండాలు ఎజెండాలు, గ్రూపులు గుంపులు పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు చెప్పిన.. ఈనాడు చెబుతున్నా.. కొడంగల్ లాగే నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండని, మామా అల్లుళ్ల చేతిలో చిక్కి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అన్యాయానికి గురైందన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : MLC Jeevan Reddy : గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు
అంతేకాకుండా.. ‘ఆదిలాబాద్ ఎడారిగా మారింది. నిర్మల్ మాస్టర్ ప్లాన్ మీ మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఎన్నికల కోసం మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. మళ్ళీ బీఆరెస్ గెలిస్తే మాస్టర్ ప్లాన్ పేరుతో మీ భూములు గుంజుకుంటరు. మంత్రిగా ఉండి కూడా ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. అలాంటి ఇంద్రకరణ్ రెడ్డిని ఎందుకు ఓటు వేయాలి.. శ్రీహరి రావుకు ఒక్క అవకాశం ఇవ్వండి… శ్రీహరిరావుకు ఓటు వేస్తే.. రేవంతన్నకు వేసినట్లే.. సోనియమ్మకు వేసినట్లే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత మాది. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.. ఔర్ ఏక్ దక్కా.. కాంగ్రెస్ పక్కా..’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Harbhajan Singh: “ఇంజామామ్‌ని ఎవరైనా డాక్టర్‌కి చూపించండ్రా”.. మతమార్పిడి వ్యాఖ్యలపై హర్భజన్ సింగ్..