టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. పేపర్ లీక్ ఘటనలో విపక్షాలను ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ లీక్‌లో ఆర్థిక లావాదేవీలు జరిగాయని హైదరాబాద్ ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. పరువు నష్టం కేసులో కేటీఆర్ నన్ను బెదిరించలేరని, కేటీఆర్ పరువు 100 కోట్లు అని ఎలా నిర్ణయించారు? 100 కోట్లు కట్టి ఆయన్ను ఏమైనా అనొచ్చా? అని ఆయన రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read : TDP MLCs Oath: టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం.. ఏం అన్నారంటే?
అంతేకాకుండా.. గతంలో కూడా ఇలానే సిట్లు ఏర్పాటు చేసి కేసులను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. సిట్ కొద్దిమందిని విచారించి కొందరిని వదిలేస్తుందని, అందరినీ విచారించాలని ఈడీకి ఫిర్యాదు చేశామని, ‘ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్ చెప్పారని రేవంత్ అన్నారు. రహస్య సమాచారం కేటీఆర్కు ఎవరు ఇచ్చారు?, తాము సమాచారం ఇవ్వలేదనీ అధికారులు చెబుతున్నారని, మరి దొంగలు ఇచ్చారా? ఆ దొంగలకు కేటీఆర్కు సంబంధం ఏంటని విమర్శించారు రేవంత్ రెడ్డి .
Also Read : April Fools’ Day: ఏప్రిల్ ఫూల్స్ డే.. అసలు ఎలా పుట్టింది..? దాని వెనక ఉన్న కథేంటి..?