ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్సీలు ఇవాళ మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు. రాంగోపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైనాట్ 175 అని సీఎం చేస్తున్న వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయి.పులివెందుల నుంచి నేను పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాను.వచ్చే ఎన్నికల్లో పులివెందులలో గెలిచి చంద్రబాబుకు అంకితం చేస్తాం అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 108 నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి టీడీపీ విజయనికి తోడ్పడింది.టీడీపీ విజయం కోసం ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Shocking : కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు మరణాలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడుతుందని గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు నాకు ఓటు వేశారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అమరావతే రాజధాని అని చెబుతున్నా. 2024లో టీడీపీ జైత్రయాత్ర ఈ ఎన్నికల నుంచే ప్రారంభమైంది. రాంగోపాల్ రెడ్డి పులివెందుల్లోనే మెజార్టీ తెచ్చారు. తిరుపతిలో ఎన్ని దొంగ ఓట్లేశారో అంతా చూశారు. టీడీపీ గెలుస్తుందని తిరుపతిలో సవాలు చేశాం. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మాట్లాడుతూ నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఏపీపీఎస్సీకి, ఉన్నతాధికారులకు దీనిపై విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. ఉద్యోగుల సమస్యలపైనా మేం పోరాటం చేస్తాం అన్నారు చిరంజీవి రావు.
Read Also: April Fools’ Day: ఏప్రిల్ ఫూల్స్ డే.. అసలు ఎలా పుట్టింది..? దాని వెనక ఉన్న కథేంటి..?