Rama Siva Reddy: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. అసలు విషయం బయటపెట్టిన కోటంరెడ్డి స్నేహితుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rama Siva Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం సృష్టించాయి.. అయితే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు విషయాన్ని బయటపెట్టారు కోటంరెడ్డి స్నేహితుడు.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇవాళ మీడియాతో మాట్లాడారు కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి.. ట్యాపింగ్ ఆరోపణలను ఖండించారు. ఇది ట్యాపింగ్ కాదని స్పష్టం చేశారు.. నా ఫోన్ కేంద్ర హోంశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు రామశివారెడ్డి.. అది ట్యాపింగ్ ఆడియో కాదన్న ఆయన.. నా ఫోన్‌లో ప్రతీ కాల్ రికార్డ్ అవుతుంది.. వేరే కాంట్రాక్టర్‌కు నా ఫోన్ నుంచి షేర్ అయ్యిందని తెలిపారు. నాది ఆండ్రాయిడ్ ఫోన్.. మా ఇద్దరివి ఐఫోన్లు అంటూ కోటంరెడ్డి తప్పుగా చెప్పారని విమర్శించారు. ఇక, నాపై ఎవరి ఒత్తిడి లేదన్న రామశివారెడ్డి.. నిజాలు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు.
Read Also: PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read
- MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
కాగా, కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా.. ఆ తర్వాత ఆయనను అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది.. ఆయన ప్రతినిథ్యం వహిస్తోన్న నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ఇంచార్జ్‌గా పెట్టింది వైసీపీ అధిష్టానం.. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.. కోటంరెడ్డి తన వెనుకే ఉంటారని భావించిన కొందరు నేతలు క్రమంగా చేజారిపోయారు.. ఆదాలకు మద్దతు ప్రకటించారు. ఇక, కోటంరెడ్డి, వైసీపీ నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!