లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ వచ్చినట్లే వచ్చి ఆవిరైపోయింది. బెయిల్ సంతోషం ఆప్ నేతలకు ఎన్నో గంటలు లేకుండా పోయింది. ఢిల్లీ కోర్టు.. కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై ఉన్న పరువు నష్టం కేసుపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసును గుజరాత్ నుంచి బదిలీ చేయాలని తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తేజస్వి యాదవ్ బదిలీ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై ఈనెల 19 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ వ్యక్తి బిల్లు కట్టకుండా బయటపడ్డాడు. సరే లే అని వదిలిపెట్టేద్దాం అనుకుంటే.. ఒక్క రోజా రెండు రోజులా ఉండలేదు. దాదాపు 603 రోజులు ఉండి డబ్బులు కట్టకుండానే ఉడాయించాడు. అక్షరాల రూ.58 లక్షల బిల్ ఎగ్గొట్టాడు ఈ చీటర్.
తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన అల్లుడు శబరీశన్‌పై మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ వేసిన పరువు నష్టం కేసు విచారణపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి ప్రాంతంలో మహిళలను, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసి, వీడియోలను తీసి బెదిరించిన ఘటనల్లో జయరామన్ కు సంబంధాలు ఉన్నాయంటూ సీఎం స్టాలిన్, శబరీశన్ విమర్శించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగించారంటూ మాజీ డిప్యూటీ…