Red ant chutney: చట్నీల్లో మామిడి, టమాట, నిమ్మలాంటివి చూశాం.. తిన్నాం. ఇక నాన్ వెజ్ లో కూడా కొన్ని రకాల చట్నీలు ఉన్నాయని తెలుసు. కానీ వెరైటీగా చీమల పచ్చడి కూడా ఉందట. అది కూడా మన భారతదేశంలోని కొందరు తింటున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆ చట్నీ రుచి అద్భుతంగా ఉంటుందని.. అనేక వ్యాధులను నయం చేస్తుందని అంటున్నారు. అయితే రెడ్ యాంట్ చట్నీ టేస్ట్ సంగతి పక్కనపెడితే.. వాటిని చెట్నీ తయారు చేయడం చూస్తే కచ్చితంగా తినడం మానేస్తారు. ఐతే ఇప్పుడు ఈ రెడ్ యాంట్ చట్నీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Read Also: Bihar Bridge Collapse: బీహార్‌లో కూలిపోయిన రూ.1500 కోట్ల వంతెన
ప్రపంచంలో ఎలాంటివైనా అన్ని రకాల వంటకాలు దొరుకుతాయి. ముఖ్యంగా వింత వంటల గురించి వినగానే మన మనసు చైనా గురించే ఆలోచిస్తుంది. ఎందుకంటే అక్కడ వింత వింత వంటలు తయారు చేసి తింటారు కాబట్టి. అయితే మన భారతదేశంలో కూడా అలాంటి వంటకాలు చాలానే ఉన్నాయి. వాటి పేరు చెబితే వాంతి వచ్చేలా ఉన్నప్పటికీ.. వాటిని చాలా రాష్ట్రాల్లో చాలా ఆసక్తిగా తింటున్నారట. ఈ రోజు మనం అలాంటి వంటకం గురించి తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటున్న వింత వంటకం ‘చింట్ కి చట్నీ’. దీని పేరు వినగానే వీటిని ఎవరు తింటారు అని అనుకుంటుంటే.. భారతదేశంలోని మూడు రాష్ట్రాలలోని కొన్ని వర్గాల ప్రజలు చీమల చట్నీని చాలా ఇష్టంగా తింటారట. అయితే ఆ రాష్ట్రాల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మరియు జార్ఖండ్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని కమ్యూనిటీలు చాలా ఇష్టంతో చింట్ కి చట్నీని తయారు చేసుకొని తింటున్నారు.
Read Also: Pawan Kalyan: రాళ్లతో పవన్‌పై దాడికి యత్నం.. నలుగురిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది..!
చీమల చట్నీ రుచి పుల్లగా మరియు కారంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ చట్నీ అనేక వ్యాధుల నుండి ఉపశమనం ఇస్తుందని తెలుపుతున్నారు. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే దీన్ని ఇష్టపడేవారని., కానీ కాలక్రమేణా దీనిని తినే వారి సంఖ్య పెరుగుతోందని అక్కడి వారు అంటున్నారు. ఈ చట్నీని సాధారణ పరిభాషలో ‘చాప్రా’ అంటారు. దీన్ని ఉప్పు మరియు కారం వేసి తయారు చేస్తారు. మరింత రుచిగా ఉండాలంటే కొత్తిమీర, పసుపు కలిపి చట్నీని తయారు చేస్తారు. ఈ చట్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని గిరిజనులు చెబుతారు. చట్నీలో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయని.. ఈ చట్నీ తినడం వల్ల దగ్గు, జలుబు, కామెర్లు, కీళ్ల నొప్పులు మొదలైన వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని వారు అంటున్నారు.