బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి లోన్ తీసుకోవాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే. రకరకాల ప్రాసెస్ లు పూర్తి చేయాలి, డాక్యుమెంట్లు సమర్పించాలి. దీనికి తోడు లోన్ ఇచ్చే కంపెనీలు అడిగిన సమాచారాన్ని అందించాలి. అన్నీ సరిగ్గా ఉన్నా వెరిఫై చేసి లోన్ రావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో కారణంతో లోన్ రిజక్ట్ కూడా కావచ్చు.
ఇకపై ఈ ప్రాసెస్ లకు ఫుల్ స్టాప్ పెట్టి లోన్లను సులభంగా పొందేలా చేయడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. దీనికి కోసం కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరికొత్త ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే పబ్లిక్ టెక్ ప్లాట్ ఫామ్. ఈ ప్లాట్ ఫామ్ లో లోన్ తీసుకోవాలనుకునే వారి వివరాలను డిజిటల్ ఫాంలో అందుబాటులో ఉంచుతారు. ఆధార్ ఇ- కేవైసీ,ల్యాండ్ రికార్డులు, పాన్ కార్డ్ వివరాలు, ఆస్తుల వివరాలు, శాటిలైట్ డేటా, ఇతర అవసరమైన వివరాలు ఈ ప్లాట్ ఫామ్ తో అనుసంధానం అయ్యేలా చూస్తారు.
Also Read: Independence Day: సముద్రం లోపల జాతీయ జెండా .. వీడియో వైరల్
ఫలితంగా మనం లోన్ కోసం అప్లై చేసుకున్న బ్యాంకులు, నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు మన వివరాలను ఆన్ లైన్ లోనే ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇక దీనిని పైలెట్ ప్రాజెక్ట్ కింద మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 17న ప్రారంభించనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, డెయిరీ లోన్లు, ఎంఎస్ఎంఈ లోన్లు ఎలాంటి హామీ లేకుండా ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా రుణాలు ఇవ్వనుంది.
మధ్యప్రదేశ్, కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద భూములు, ఇతర వివరాలను అనుసంధానం చేస్తున్నారు. ఇలా అన్ని వివరాలను డిజిటల్ రూపంలో ఉంచడం ద్వారా లోన్ ప్రాసెసింగ్ కు తక్కువ సమయం పడుతుందని తద్వారా వేగంగా రుణాలు పొందవచ్చని చెబుతోంది ఆర్బీఐ.