RT75 Launched Officially Today: ‘మాస్ మహారాజ’ రవితేజ వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. ఇటీవల RT75 (రవితేజ 75) సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు (జూన్ 11) రవితేజ 75వ సినిమా పూజాకార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు రవితేజ 75ను నిర్మిస్తున్నారు.
Also Read: Modi Cabinet 3.0: ప్రధాని నరేంద్ర మోడీ చేతిలోనే కీలక శాఖలు!
RT75లో రవితేజ సరసన కుర్రాళ్ల కళల రాణి శ్రీలీల నటిస్తున్నారు. ఈ ఇద్దరు 2022లో వచ్చిన ధమాకా సినిమాలో నటించారు. ఆ చిత్రంలో రవితేజ, శ్రీలీల జోడి అందరినీ ఆకట్టుకుంది. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చుస్తున్నారు. ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. రవితేజ కెరీర్‌లో ఇది 75వ చిత్రం కావడం విశేషం. ఇందులో లక్ష్మణ్ భేరి అనే పాత్రలో మాస్ మహారాజ కనిపించనున్నారని తెలుస్తోంది. రవితేజ పక్కా తెలంగాణ స్లాంగ్‌తో రాబోతున్నట్టు సమాచారం. మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది.