Bharta Mahashayulaku Vignapti: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రిలీజ్‌కు రడీ అవుతుంది. ఈ చిత్రం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్లు ఫుల్ జోష్‌లో చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రేపు (జనవరి 10) హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
READ ALSO: Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. ఏడుగురు నిందితులకు బెయిల్..
కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ కనిపించనున్నారు. సన్నీ, వెన్నెల కిషోర్, సత్య, మురళీధర్ గౌడ్ తదితరులు సపోర్టింగ్ రోల్స్‌లో అలరించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నారు. బుధవారం (జనవరి 7)న రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌కు చేరుకుంది. ఈ ట్రైలర్‌ను గమనిస్తే రవితేజ ఇందులో తన విన్టేజ్ కామెడీ స్టైల్‌తో అదరగొట్టేశాడు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్నట్లు కనిపించింది. ఈ ట్రైలర్‌ను చూసిన తర్వాత పలువురు మాస్ మహారాజా అభిమానులు.. ఈ చిత్రం పక్కగా సంక్రాంతి బరిలో నిలిచి గెలిచే పుంజు అంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో – హీరోయిన్లతో పాటు సినిమా తారాగణం, సాంకేతిక బృందం మొత్తం పాల్గొంటారని టాక్. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం పలు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది.
READ ALSO: Toxic Director:అల్లు అర్జున్ సినిమాకి వర్క్ చేసిన టాక్సిక్ డైరెక్టర్ భర్త.. ఎవరో తెలుసా?