ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో మెరవడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే సమంత, తమన్నా వంటి వారు ఈ బాటలో సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న కూడా తన డ్యాన్స్‌తో కుర్రాళ్లను ఆకట్టుకోవడంతో, దర్శక నిర్మాతలంతా ఆమెతో ఐటెం సాంగ్స్ చేయించాలని తెగ ట్రై చేస్తున్నారు. రష్మికను హీరోయిన్గా పెడితే అటు గ్లామర్, ఇటు స్పెషల్ సాంగ్ రెండూ సెట్ అవుతాయని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, రష్మిక తాజాగా వీరందరికీ ఊహించని షాక్ ఇచ్చింది.
Also Read : Ravi Teja : రవితేజ 77వ సినిమా ‘ఇరుముడి’.. భక్తి, భావోద్వేగాలతో అదిరిపోయిన ఫస్ట్ లుక్ !
తాను కేవలం ఇద్దరు దర్శకుల సినిమాల్లో మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని, మిగతా ఎవరికీ అందుబాటులో ఉండనని రష్మిక తెగేసి చెప్పింది. ఆ ఇద్దరు ఫేవరెట్ దర్శకులు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచినా, ఈ కండిషన్ విన్న మిగతా డైరెక్టర్లు మాత్రం కాస్త ఫీల్ అవుతున్నారు. రష్మిక పాన్ ఇండియా క్రేజ్‌ను తమ సినిమాల కోసం వాడుకోవాలని ఆశపడ్డ టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం రష్మిక ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో చాలా బిజీగా ఉంది. బాలీవుడ్లో కూడా ‘కాక్ టెయిల్ 2’ వంటి పెద్ద ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. చేతినిండా సినిమాలు ఉండటంతోనే ఆమె ఇలా సెలెక్టివ్‌గా మారుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి ఆ ఇద్దరు లక్కీ డైరెక్టర్లు ఎవరో తెలియాలంటే ఆమె స్వయంగా రివీల్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే!