గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరల్డ్ స్టార్ గా అందరికి తెలుసు.. హీరోగా అవార్డులను అందుకున్న రామ్ చరణ్ గరిట పట్టుకొని వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోను తన భార్య ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఉమెన్స్ డే స్పెషల్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు షాక్ అవ్వడమే కాదు.. ఇలా వంట మాస్టర్ గా మార్చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
అందులో ఉపాసన మాట్లాడుతూ.. అత్తమ్మ ఈరోజు మీరు కిచెన్ ఏం చేస్తున్నారు.. రామ్ చరణ్ గారు మీరు ఏం వంట చేస్తున్నారు అని అడుగుతుంది.. పనీర్ టిక్కా చేస్తున్నా అని సమాధానం ఇస్తాడు.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఆ తర్వాత బుచ్చిబాబుతో మరోసినిమాను లైన్లో పెట్టాడు..