Akbaruddin Owaisi : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సభలో తన ప్రత్యేక శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ఇచ్చే హామీలు, అవి అమలయ్యే విధానం, ప్రజలకు అందే ప్రయోజనాలను ఉద్దేశించి ఆయన ఒక ఫన్నీ స్టోరీ చెబుతూ నేరుగా ప్రభుత్వ తీరును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రసంగిస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు ఫేకులు గురించి ఒక కథను వినిపించారు. ఈ కథ ప్రభుత్వాలు…
Cabinet Meeting: నేడు (మార్చ్ 19న) తెలంగాణ కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యి.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ రేపు (మార్చ్ 19న) అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశం కానుంది. గురువారం నాడు ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యి.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘర్షణాకర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో స్పీకర్‌ను ఉద్దేశించి “మీరు మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు. ఈ సభ మీ సొంతమేం కాదు” అంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం…
KTR : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం పూర్తిగా ప్రాథమికంగా రాసిన ఒక…
రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా నిరుద్యోగ యువతకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సాయం చేయనున్నారు. మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12 నుంచి మొదలవబోతున్నాయి. దాంతో.... మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా? రారా అన్న చర్చ మరోసారి జరుగుతోంది రాజకీయవర్గాల్లో. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సభకు వస్తే ఆయన్ను టార్గెట్ చేసేందుకు రెడీగా ఉందట కాంగ్రెస్. ఆయన పదేళ్ళ పాలనను సభ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేసీఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ...
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మారోసారి టార్గెట్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినదంతా.. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించేదని అన్నారు.. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు, సామాజిక సంస్కర్త పట్ల ఆ పార్టీ దారుణంగా ప్రవర్తించిందన్నారు.. అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు.. అంబేద్కర్‌ను ఓడించేందుకు కుట్రలు చేసిందని విమర్శించారు.
PM Modi: బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పెదవివిరిచాయి. అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ద్వారకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు. Read Also: Rashtrapati Bhavan: సోనియాగాంధీ వ్యాఖ్యలను…