D. Sridhar Babu: అలుపెరుగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D. Sridhar Babu: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాల్ని స్మరించుకునే ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు, సకల జనులకు, ప్రత్యేక రాష్ట్ర అకాంక్షను గౌరవించి మద్ధతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ, తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా గాంధీకి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని పేర్కొన్నారు.
Also Read
Read also: TSRTC MD VC Sajjanar: గుడ్ న్యూస్.. త్వరలోనే టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ..
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ద్యేయంగా సీయం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల ఆశయ సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందుతున్నదని వివరించారు.
యావత్ తెలంగాణ సమాజం యొక్క మనోభావాలకు అనుగుణంగా, ప్రజా సంఘాలు, పౌర సంస్థలు, ఉద్యోగ సంఘాలతో సంప్రదిస్తూ… వారి అభిప్రాయాలను గౌరవిస్తూ…ప్రజాస్వామిక పాలనను అందిస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించిందని పునరుద్ఘాటించారు. తెలంగాణాలో సకాలంలో వర్షాలు పడి, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రములో, ప్రజలు అందించిన కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రతీ ఆకాంక్ష నెరవేరేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
Jaya Jaya Telangana: తెలంగాణ గీతం ఆవిష్కరణ.. భావోద్వేగానికి గురైన అందెశ్రీ
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?