Heavy Rain: తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ నెల 12, 13 తేదీల్లో కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Read also: Bhadradri Kothagudem: అది బండి అనుకున్నావా బస్సు అనుకున్నావా.. స్కూటీపై 8 మందా!
శనివారం వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో జల్లులతో కూడిన వర్షం నమోదైంది. హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నం, మాదాపూర్, మూసాపేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, చందానగర్, షేక్ పేట్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో మరో నాలుగు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం హైదరాబాద్‌లో గరిష్టంగా 29.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 27-29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని ఆయన తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
RishiSunak: అక్షరధామ్ టెంపుల్ ను దర్శించుకున్న ఆ దేశ ప్రధాని, ఆయన భార్య