బంగాళాఖాతంలో ఏర్పడిన డానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈనెల 23న తుఫాన్ తీరం దాటనుంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 23-25న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Yagi Typhoon Myanmar : యాగీ తుఫాను రాక మయన్మార్లో వినాశనానికి కారణమైంది. ఇందులో కనీసం 74 మంది మరణించినట్లు నివేదించబడింది. మొదట్లో ఈ సంఖ్య 33 ఉండగా ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగింది.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని.. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో మరో సారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జన జీవనంత అస్తవ్యస్తంగా మారింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Wayanad Landslides : వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన తర్వాత అత్యంత విషాదకరమైన, భయానక కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషాదం 300 మందికి పైగా ప్రాణాలను బలిగొంది.
ఏపీలో గత ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. రాష్ట్రంలో వర్షాలకు కారణం వాయుగుండమేనని అని ఆయన వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడనుంది.