KVP Ramachandra Rao: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. ఆంధ్రప్రదేశ్‌ఖి ప్రత్యేక హోదా వస్తుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.. రెండు ప్రాంతీయ పార్టీలూ సిద్ధాంత పరంగా కాంగ్రెస్ పార్టీతో కలిసిరావడానికి సిద్ధంగా లేవన్న ఆయన.. మా సహజ మిత్రులు కమ్యూనిష్టు పార్టీలు మాతో కలిసి వస్తాయన్నారు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి సందేశం, ఆదేశం ప్రకారం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసి రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి కలిగిస్తాం అన్నారు.. 2024లో రాహుల్ ప్రధాని అవుతారు.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు కేవీపీ.
Read Also:CISF recruitment 2023 : ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?
ఇక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి మారబోతోందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ మారబోతోందన్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ షర్మిల అంశంపై మాట్లాడదాం అంటూ దాట చేశారు కేవీపీ రామచందర్‌రావు. కాగా, ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారం హీట్ పుట్టిస్తోంది.. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ లో ఫలితాలు వెలువడనున్న విషయం విదితమే.. అన్ని పార్టీలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.. మరోవైపు.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు కొనసాగిస్తున్నాయి.