కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీపై, మన పార్టీపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాలు నన్ను, నా కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఫాం హౌస్ ను పావుగా వాడుకోవడం.. నాకు తీవ్ర మనోవేదన కలిగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. మా ఫాం హౌస్ లో ఏ కట్టడమూ ఎఫ్‌టీఎల్,బఫర్ జోన్ పరిధిలో లేవు.. ఏ కట్టడమైనా ఒక్క అంగుళం మేరకు ఉన్నా.. నా సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.
KVP Ramachandra Rao: అసెంబ్లీ ముందున్న టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా ప్రదాత టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. పురాణాల్లో కర్ణుడి గురించి విన్నాం.. ఈ తరంలో ప్రకాశం పంతులు గురించి విన్నామన్నారు.
2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. ఆంధ్రప్రదేశ్‌ఖి ప్రత్యేక హోదా వస్తుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
వైఎస్సార్ ఎలా ముందుకు వెళ్లారో అలా మనం ముందుకు వెళ్తే తప్పకుండా 2023లో అధికారంలోకి వస్తాం.. రాహుల్ ని పీఎం చేయడం వైఎస్ఆర్ ఆశయం.. దాన్ని మనం నిజం చేద్దాం.. లోక్ సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో మొత్తం ఎంపీ సీట్లను గెలిపిద్దాం అంటూ కేవీపీ పిలుపునిచ్చారు.
పురంధేశ్వరి పట్ల జాలి పడుతున్నాను అన్నారు కేవీపీ.. బీజేపీ చేసిన పనులకు పురంధేశ్వరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అసలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీయే అని మండిపడ్డారు కేవీపీ.
రాహుల్ సభ్యత్వ రద్దుపై ఏపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడక పోవటంతో ఆంధ్రుడిగా తాను సిగ్గుతో తల దించుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదు అంటూ కేవీపీ నిలదీశారు..
KVP Ramachandra Rao: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావును వైఎస్ ఆత్మగా పిలిచేవారు.. అయితే, వైఎస్సార్ కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌తో కేవీపీకి సంబంధాలు లేవు.. ఇవాళ విజయవాడలో మీట్‌ది ప్రెస్‌లో ఇదే ప్రశ్న కేవీపీకి ఎదురైంది.. దీనిపై స్పందిస్తూ.. వైఎస్సార్‌కు దగ్గరగా ఉన్న నేను జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పబోనన్నారు.. కానీ, ఈ ప్రశ్నల…
KVP Ramachandra Rao: భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. తమ స్వార్ధప్రయోజనాల కోసం కొన్ని ప్రమాదకర పద్ధతులను కేంద్ర ప్రభుత్వం పాటిస్తోంది.. ఉన్మాద మనస్తత్వం కలిగిన ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాం అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు.. విజయవాడలో మీట్ ద ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. భారతదేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. భారతదేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే.. అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయని మండిపడ్డారు.. మనం కట్టే ప్రతీ కరెంట్ బిల్లులో అదానీకి వాటా…