ఇంటర్ చదివిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆర్మీలో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత గల అభ్యర్థులు ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది,నవంబర్ 28, 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, సంస్థలోని 215 పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అర్హతలు..
అభ్యర్థులు రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు మరియు అథ్లెటిక్స్‌కు ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అలాగే, ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి… ఫస్ట్ క్లాస్ లో పాసైన వారికి ప్రాధాన్యత ఎక్కువ..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
ట్రయల్ టెస్ట్, ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంటేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఈ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో మాత్రమే ఆన్‌లైన్ మోడ్ ద్వారా అభ్యర్థులకు అన్ని దశల రిక్రూట్‌మెంట్ కోసం కాల్-అప్ లెటర్‌లు/అడ్మిట్ కార్డ్ లను అందజేస్తారు..
దరఖాస్తు ఫీజు..
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు..UR, OBC మరియు EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 100. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన మహిళా అభ్యర్థులు మరియు అభ్యర్థులు దరఖాస్తులకు ఫీజు లేదు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను సందర్శించండి..