IIT Roorkee : పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఐఐటీ రూర్కి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను iitr.ac.in సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 30, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం.. గ్రూప్ బి మరియు సి పోస్టులకు భర్తీ కోసం ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నడుస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ బి పోస్టుకు 31 ఖాళీలు, గ్రూప్ సికి 47 ఖాళీలు నిర్ణయించారు.ఈ డ్రైవ్ కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.. దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. OBC / EWS కేటగిరీకి రూ. 400 ఫీజు చెల్లించాలి. అదే సమయంలో, SC / ST / PWD మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయించబడ్డారు.
దరఖాస్తు చేసుకునే విధానం ఈ క్రింది విధంగా వుంది.
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
Step 1: అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ iitr.ac.inని సందర్శించండి.
Step 2: తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో కెరీర్‌ల ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
Step 3: అభ్యర్థులు దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
Step 4: ఇప్పుడు అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకోండి.
Step 5: అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
Step 6: ఆ తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించండి.
Step 7: తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి. చివరగా, అభ్యర్థి దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.
అయితే దానిలో ఉన్న విభాగాల వారీగా ఖాళీల వివరాలు….
1. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – 10
2. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ – 02
3. అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ – 01
4. జూనియర్ టెక్నికల్ ఆర్కిటెక్చర్ – 01
5. కోచ్ – 02
6. స్టాఫ్ నర్స్ – 02
7. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – 01
8. జూనియర్ సూపరింటెండెంట్ – 12
9. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ – 23
10. డ్రైవర్ – 01
11. జూనియర్ అసిస్టెంట్ – 23
మొత్తం – 78
కనుక అర్హత కలిగిన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..