కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి,మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ ‘సైరన్’.108 అనేది ఉపశీర్షిక.ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.తాజాగా సైరన్ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్‌లలోనే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సైరన్ మూవీలో క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఓ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ లో జయం రవి పాత్రకు అనుపమ పరమేశ్వరన్ భార్యగా నటిస్తున్నట్లు సమాచారం. సైరన్ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ మరియు ట్రైలర్ కి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. అయితే, గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న సైరన్ మూవీని డిసెంబర్‌లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ, చెప్పిన సమయానికి సైరన్ మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.దీంతో సైరన్ మూవీ డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో సైరన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అందుకు సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సైరన్ మూవీని థియేటర్‌లలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.ఫిబ్రవరి 16వ తేదిన తెలుగు మరియు తమిళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సైరన్ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.దీనికి సంబంధించిన మూవీ పోస్టర్స్‌ను సోషల్ మీడియాలో మేకర్స్ పోస్ట్ చేశారు. దీంతో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన సైరన్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వార్తలకు పులిస్టాప్ పడినట్లు అయింది.సైరన్ చిత్రంలో తమిళ పాపులర్ కమెడియన్ యోగిబాబు, నటుడు సముద్రఖని, కౌశిక్ మెహతా మరియు తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిమన్యుడు మరియు విశ్వాసం సినిమాలకు రచయితగా పని చేసిన ఆంటోని భాగ్యరాజ్ సైరన్ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. ఈ చిత్రానికి కథను కూడా ఆంటోనీ భాగ్యరాజ్ అందించారు. సుజాత విజయ్ కుమార్ మరియు అనూష విజయ్ కుమార్ సైరన్ సినిమా కు నిర్మాతలుగా వ్యవహరించారు.అలాగే ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ను అందించారు.
. @actor_jayamravi coming out on parole this Feb16th ! 🚨#SirenFromFeb16 #Tamil & #Telugu
A @gvprakash Musical @antonybhagyaraj @anupamahere @sujataa_HMM @iYogiBabu @IamChandini_12
@AntonyLRuben @brindagopal @dhilipaction @selvakumarskdop @SaktheeArtDir @shiyamjack… pic.twitter.com/Au67K5Vo3F— Keerthy Suresh (@KeerthyOfficial) January 22, 2024