తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమల భూముల కన్వర్షన్‌కు అనుమతించే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ.. హిల్ట్ ఒకటైతే, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మునిసిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే డెసిషన్ మరొకటి. ఈ రెండింటినీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత నిర్వహించిన తాజా ప్రెస్‌మీట్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత తన మీడియా సమావేశంలో కొత్తగా చెప్పిన అంశాలేమీ లేవని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
Aadi srinivas: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ రాజకీయాల్లో నువ్వా..నేనా.. అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణమని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలన్న విషయంలో బీజేపీకి స్పష్టతే లేదు. బీసీ బిల్లుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాల్సిందని రఘునందన్ రావుపై విమర్శలు గుప్పించారు. కానీ, ఆయన అది చేయకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) రఘునందన్ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5(2) ప్రకారం, ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ అనుమతితో పాటు, DOT…
Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బుధవారం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ చేపట్టిన దర్యాప్తులో 2023 నవంబర్ 15నుంచి ఈ ఇద్దరు ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. కేవలం ఎంపీల ఫోన్లు మాత్రమే కాకుండా, వారితో అనుబంధం ఉన్న ముఖ్య అనుచరులు, కుటుంబసభ్యుల ఫోన్లు…
రేపు సిట్ అధికారుల ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.
Raghunandan Rao: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) అంశంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. యుద్ధం చేసే ధైర్యం, దమ్ము ఉంటేనే మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అలాగే ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. యుద్ధం అనేది మాటలతో మాట్లాడేది కాదు.. అది చేసేటోనికి తెలుస్తుంది. రేవంత్ రెడ్డిది నెత్తి కాదు, కత్తి కాదు.. అంటూ ఆయన…
జిన్నారంలో ఏం జరుగుతుందో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను నాలుగుసార్లు ఎంపీగా అడిగినా సరైన సమాధానం లేదు అని పేర్కొన్నారు. దేశద్రోహులను వెంటనే పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటికి అధికార యంత్రాంగం స్పందించడం లేదు అని ఆరోపించారు. దేశద్రోహులకు, కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం బయటపడింది అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.