తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ నేడు జరిగింది. అయితే.. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి వచ్చారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. నేను సి.కల్యాణ్ ప్యానెల్ అని, చాలా శాతం ఓటింగ్ కంప్లీట్ అయ్యిందన్నారు. ఏ ప్యానల్ గెలిచినా 80 శాతం నిర్మాతలకు ఉన్న కష్టాలను తీర్చాలన్నారు.
Also Read : Multibagger Stocks: రూ.4కి లభించే షేర్ రూ.400 దాటింది.. కొన్ని వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే కోటీశ్వరులయ్యేవారు
సినిమా కనెక్టాయితే.. ఎవరు ఆపలేరని, కానీ చాలా మంది లాస్ అవుతున్నారన్నారు. థియేటర్స్ మార్నింగ్ షో సమస్యలను తీర్చాలని, క్యూబ్ వల్ల లాస్ అవుతున్నామన్నారు. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని, ఆ డిమాండ్ నెరవేర్చాలన్నారు. పండగ సెలవుల్లో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి… చిన్న సినిమాలకు అవకాశం రావడం లేదన్నారు. అంతేకాకుండా.. ‘సగటు సినిమాలకు కూడా అవకాశం ఇవ్వాలి. తమిళ్ ఇండస్ట్రీలో అన్ని సినిమాలకు అవకాశం ఉన్నట్లే… ఇక్కడ కేసీఆర్ కూడా చేయాలి. జంతువులను హింసించలేదని.. సినిమాలలో వేస్తున్నాం.. కానీ ప్రొడ్యూసర్స్ కు ఇంకా హింస ఉంది. కొద్ది మంది కోసం.. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది.. చిన్న నిర్మాతల ను కాపాడాలి.’ అని ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.
Also Read : Stuart Broad: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ షాకింగ్ నిర్ణయం..అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై