Stuart Broad: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ షాకింగ్ నిర్ణయం..అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్‌లో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తనకు చివరిది అని తెలిపాడు. యాషెస్ తర్వాత వైదొలుగుతానని బ్రాడ్ చెప్పాడు.
Hyper Aadi: ఆ యాంకర్ తో హైపర్ ఆది పెళ్లి.. ?
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్లపై బీజేపీ ఫైర్..
స్టువర్ట్ బ్రాడ్ 2006 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తన కెరియర్‌లో 167 టెస్టులు ఆడి 602 వికెట్లు తీశాడు. వన్డేల్లో 121 మ్యాచ్‌లలో 178 వికెట్లు, టీ20ల్లో 56 మ్యాచ్‌లలో 65 వికెట్లు తీశాడు. టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. మరోవైపు బ్రాడ్.. టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఏడేళ్లుగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంటున్న బ్రాడ్.. చివరి వన్డే 2016 ఫిబ్రవరిలో, చివరి టీ20 2014 మార్చిలో ఆడాడు. స్టూవర్ బ్రాడ్ బౌలర్ గానే కాకుండా.. బ్యాట్స్‌మన్ గానూ మంచి స్కోర్లు నమోదు చేశాడు. టెస్టుల్లో 3,656 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ITR Filing: ఐటీఆర్‌లో నకిలీ బిల్లు లేదా అద్దె రసీదును వాడారో.. అంతే 200% జరిమానా పడుద్ది
బ్రాడ్ కెరియర్ ఆరంభంలోనే ఇండియా ఒకప్పటి స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ పీడ కల మిగిల్చాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి యువీ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ బ్రాడ్ పై మానసికంగా చాలా ప్రభావం చూపింది. అంతటితో ఆగని బ్రాడ్.. తర్వాత గోడకు కొట్టిన బంతిలా పైకి ఎదిగాడు. ఇప్పటితరం మేటి బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున జేమ్స్ అండర్సన్ తర్వాత 600 వికెట్లు సాధించిన బౌలర్‌గా స్టూవర్ట్ బ్రాడ్ రికార్డులకెక్కాడు.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!