తెలంగాణ ఆర్టీసీలో ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లతో ముందుకు వెళ్తున్న యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను తొలిగించేందుకు శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే క్యాష్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టంను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు ఈ అంశంపై కసరత్తు దాదాపుగా పూర్తిగా చేశారు. గత సంవత్సరం చివరిలోనే నగదు రహిత టికెట్ కొనుగోలు పద్దతిని ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు భావించారు.
Read Also: UtterPradesh: జూలో నృత్యం చేసిన కొంగ.. ఎందుకో తెలుసా..?
అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఆగిపోయింది. ప్రయాణికులు టికెట్ కొనుగోలు కోసం క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించిన డబ్బులు ఎవరి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి..? ఏదైనా కారణం చేతనైన డబ్బులు జమ కాకపోతే ఆ డబ్బులకు ఎవరు బాధ్యత వహించాలి?.. అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనిని ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల్లో అమలు చేయాలనే ఆలోచనతో ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
Read Also: ADR Report: దేశంలో 44 శాతం ఎమ్మెల్యేలు నేరచరితులే.. ఏడీఆర్ నివేదికలో కీలక విషయాలు!
ఇక, నగదు రహిత టికెట్స్ వస్తే సగం చిల్లర బాధ తప్పినట్లే అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో పాటు డిజిటల్ చెల్లింపుల్లో కూడా ఆర్టీసీ అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోరకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ విధానం సక్సెస్ అయితే.. మరి కొన్ని రోజుల్లోనే తెలంగాణ ఆర్టీసీలో నగదు రహిత టికెట్ అందుబాటులోకి వస్తుంది.