UtterPradesh: స్నేహం ఎంతో మధురమైంది. స్నేహం వయస్సుతో సంబంధం లేదు.. స్నేహం లింగ బేధాలు చూసుకోదు.. అందుకే స్నేహామేరా జీవితం.. స్నేహామేరా శాశ్వతం అని ఒక కవి రాశాడు. ఇంతటి మహిమ ఉన్న స్నేహం కేవలం వ్యక్తుల మధ్యనే కాదు.. మనుషులు జంతువుల మధ్య.. మనుషులు పక్షుల మధ్య స్నేహం కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక స్నేహితుడు చాలా రోజుల తరువాత కలిస్తే వారిద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అలాంటి పరిస్థితి ఒకటి జూలో జరిగింది. అదేందీ జూలో స్నేహితులు ఉండటం ఏమీటని అనుకుంటున్నారా? అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే..
Read also: ADR Report: దేశంలో 44 శాతం ఎమ్మెల్యేలు నేరచరితులే.. ఏడీఆర్ నివేదికలో కీలక విషయాలు!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీకి చెందిన ఆరిఫ్‌కు వ్యవసాయక్షేత్రం ఉంది. వ్యవసాయక్షేత్రంలో ఉన్న సమయంలో తీవ్ర గాయాలతో ఒక సారస్ కొంగ వచ్చింది. గాయాలతో ఉన్న కొంగను దగ్గరకు తీసుకొని చికిత్సను చేయించి ప్రాణాలను కాపాడాడు. అనంతరం తన వ్యవసాయ క్షేత్రంలోనే సారస్ కొంగను ఉంచాడు. దీంతో ఆ కొంగ ఆరిఫ్‌ను వదిలిపెట్టి ఉండేది కాదు. ఎప్పుడైనా ఆరిఫ్ బయటికి వస్తే .. తనతోపాటు కొంగ కూడా బయటికి వచ్చేది. తాను బైక్‌పై బయటికి వెళితే కొంగ కూడా తనను అనుసరిస్తూ తలపై ఎగురుతూ వచ్చేది. విషయం కాస్త అటవీ శాఖ అధికారులకు తెలిసింది. దీంతో అటవీశాఖ అధికారులు బలవంతంగా సారస్ కొంగను జూకు తరలించారు.
Read also: Bonal Festival: వైభవంగా లాల్ దర్వాజా సింహవాహిన మహంకాళి బోనాలు.. పోటెత్తిన భక్తజనం
ఏడాది కిందట.. తీవ్రంగా గాయపడిన సారస్ కొంగ ప్రాణాలను కాపాడి సంరక్షించి వార్తల్లోకి ఎక్కాడు ఆరిఫ్. దాంతో ఆ కొంగ ఆరిఫ్‌ను వదిలి క్షణం కూడా ఉందేది కాదు. ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లినా తలపై ఎగురుతూ అనుసరించేది. ఈ విషయం అటవీ అధికారులకు తెలిసి కొంగను బలవంతంగా జూకు తరలించారు. చాలా రోజుల తరువాత ఆరిఫ్ కొంగను చూడాలనుకున్నాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని మాస్క్ ధరించి కాన్పుర్ జూకు వెళ్లారు. అయితే మాస్క్ పెట్టుకున్నప్పటికీ ఆరిఫ్‌ను సారస్ కొంగ గుర్తు పట్టేసింది. తన ఫ్రెండ్ తనను చూడటానికి రావడంతో గుర్తుపట్టిన కొంగ.. పట్టలేని సంతోషంతో ఊగిపోయింది. జూలోని కొంగ ఆనందంతో నృత్యం చేసింది. ప్రేమగా అరుస్తూ దగ్గరకు వెళ్లేందుకు తహతహలాడింది. ఈ సన్నివేశాన్ని ఆరిఫ్ తన ఫోనుతో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇపుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.