కొన్నేళ్లుగా భక్తి పేరిట మభ్యపెట్టి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో, ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో.. వచ్చే నెల 5వ తేదీ వరకు పూర్ణానంద స్వామికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే.. పూర్ణనంద రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు చెప్పారు దిశ పోలీసులు.
రిమాండ్ రిపోర్ట్‌లో.. అర్ధ రాత్రి మైనర్ బాలిక లని నిద్ర లేపి తన గదికి తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసే వాడు అని, స్వామీజీ ఏడాది కాలంగా అత్యాచారం చేయడంతో మరో మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు దిశ డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఇద్దరు మైనర్ బాలికల పై అత్యాచారం చేసినట్లు ప్రాథమికంగా ఆధారాలు లభించాయని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న దిశ పోలీసులు.. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలిక ను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు.
Also Read : Bangalore: డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి భేటీ.. కర్ణాటక చేరిన టీ కాంగ్రెస్ రాజ’కీ’యం
బాధితులు గర్భం దాల్చే అవకాశం ఉన్న సమయాలలో టాబ్లెట్స్ ఇచ్చి పూర్ణానంద జాగ్రత్త పడే వాడని తెలిపారు. విశాఖ లోని కేజీహెచ్ ఆసుపత్రిలో పూర్ణానంద స్వామీజీ కి పోటన్సి టెస్ట్ నిర్వహించారు పోలీసులు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. బాధితురాలు స్టేట్మెంట్ ఆధారంగా Cr.No.0/2023 U/s.342, 376 (2)(1), 376(3)లో జీరో FIR నమోదు చేశారు. 323 IPC, Sec.6 of POCSO Act, 2012 కేసు నమోదు చేశారు పోలీసులు. విజయవాడ లో మహిళా గైనకాలజిస్ట్ చేత వైద్య పరీక్షలు బాధితులకి మెడికల్ టెస్ట్ లు నిర్వహించారు. జీరో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా, దిశ పోలీసులు Cr.No.165/2023 U/s.342, 376 (2)(f), 376(3), 323 IPC మరియు POCSO చట్టం, 2012లోని సెక్షన్.6లో మళ్లీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితులకు మెడికల్ టెస్ట్ లు నిర్వహించిన తరువాత శాంపిల్స్ ను ఎఫ్.ఎస్.ఎల్ కి పంపించారు ఎఫ్.ఎస్.ఎల్ ప్రాథమిక నివేదిక కూడా అత్యాచారం జరిగినట్టు అధికారులు తేల్చారు.