‘ప్యూర్ ఓ నాచురల్’ 50వ స్టోర్‌ను మేడ్చల్ జిల్లా కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, డీసీపీ కే సురేష్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో కస్టమర్ల మన్నలను పొంది మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ… గత 21 సంవత్సరాలుగా తమ స్టోర్లను ఆదరిస్తున్న కొనుగోలుదారులకు కృతజ్ఞత భావంతో ఉంటామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘ప్యూర్ ఓ నాచురల్’ స్టోర్లు చాలానే ఉన్నాయి. ఈ స్టోర్‌లో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు తాజాగా దొరుకుతాయి. ఆస్ట్రేలియా, అమెరికా, థాయిలాండ్ తదితర దేశాల నుంచి దిగుమతి అయిన పండ్లు అందుబాటు ధరల్లో ఉంటాయి. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు కూడా ప్యూర్ ఓ నేచురల్ స్టోర్‌లో దొరుకుతాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా స్టోర్లు ఉండగా.. తాజాగా కూకట్పల్లి వాసులకు అందుబాటులోకి వచ్చింది.