ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ ఎంతో మంది నటులు తమకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకొని ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. అలాంటి వారిలో రాగ్ మయూర్ ఒకరు. ‘సినిమా బండి’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి, తన విలక్షణమైన నటనతో.. అద్భుతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయ్యాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోకుండా నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ కెరీర్ లో ఆచితూచి ముందడుగు వేస్తున్నాడు. అందుకే తను ఏ పాత్ర చేసిన చాలా సహజంగా ప్రేక్షకులకు హత్తుకునేలా ఉంటుంది.
Also Read: Empuraan: ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ నుండి మరో పవర్ ఫుల్ పోస్టర్ విడుదల..
ఇక ‘సినిమా బండి’ చిత్రం తర్వాత ‘కీడాకోలా’ మూవీలో నటించాడు రాగ్ మయూర్. ఈ సినిమాలో లంచం అనే పాత్రలో కనిపించి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడి ఆడియన్స్‌ను సప్రైజ్ చేశాడు. దీం తర్వాత ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమా కూడా అతనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక రీసెంట్ గా ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ తో వచ్చాడు రాగ్. ‘పంచాయత్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో ఉంది.
అయితే సుకుమార్ కూతురు సుకృతి నటించిన ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో రాగ్ మయూర్ విలన్ పాత్రలో నటించాడు. ఇక రాగ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఈ ‘సివరపల్లి’, ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలు ఒకే టైం లో రిలీజ్ అవ్వడం అతని కెరీర్ లో ఒక అరుదైన అంశంగా పరిగణించవచ్చు. ప్రస్తుతం రాగ్ మయూర్ ‘గరివిడి లక్ష్మి’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.