ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా ఆదివారం 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే గత మూడేళ్ల నుండి పంజాబ్‌పై విజయం కోసం చెన్నై జట్టు ఎదురుచూస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ 4 మ్యాచులు విజయం సాధించగా, చెన్నై కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్ లో కూడా 49వ మ్యాచ్ లో చెన్నై 7 వికెట్ల తేడాతో పంజాబ్ పై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Also read: Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ‘రైతుబంధు’ డబ్బులు పడేది అప్పుడే..
ఇకపోతే, ఈ సీజన్‌లో చెన్నైపై ఒత్తిడిని కొనసాగించడం పంజాబ్ కు కాస్త కష్టమే. దీనికి కారణం పాయింట్ల పట్టికలో పంజాబ్ 8 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా., చెన్నై జట్టు 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఆదివారం జరిగే మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా చెన్నై పట్టికలో టాప్ 3 లోకి ప్రవేశించాలని చూస్తుంది. ఇక ఇరుజట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే.. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొత్తం 30 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో చెన్నై పంజాబ్ పై పైచేయి సాధించింది. చెన్నై 16 మ్యాచ్ లు గెలవగా, పంజాబ్ 14 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఇక నేడు జరిగే ధర్మశాల స్టేడియంలో మాత్రం.. ఇరు జట్లు సమాన గెలుపోటములు ఉన్నాయి. ఇరు జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్ లు ఆడగా చెరో ఒక్కో విజయం సాధించాయి.
Also read: Tandur: తాండూరులో కన్నుల పండుగగా శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి వారి రథోత్సవం..
ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఆటగాళ్ల విషయానికి వస్తే.. పంజాబ్ ఆటగాళ్ల విషయానికి వస్తే.. జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, రీలీ రోసోవ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్ లు ఉన్నారు. ఇక మరోవైపు..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అజింక్య రహానే (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్పాండే, రిచర్డ్ గ్లీసన్, మతీషా పథిరానా లు ఉండొచ్చు.