శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణములో నడిబొడ్డున ఉన్నది. కోర్కెలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించి సన్నాయి మేళ తాళాల మధ్య స్వామివారిని రథోత్సవం పై ప్రతిష్టించి దేవాలయ ప్రాంగణం నుండి బసవన్న కట్టవరకు వేలాదిమంది భక్తజనం మధ్య కన్నుల పండుగ రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు శాసనసభ్యులు బియ్యని మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభ ప్రభు పటేల్ లతోపాటు స్థానిక నాయకులందరూ కలిసి మొదట స్వామివారిని దర్శించుకుని., రథానికి హారతి ఇచ్చి.. రథం లాగారు.
Also Read: Station Master: డ్యూటీలో ఉండగానే కునుకు తీసిన రైల్వే స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ లేక కదలని రైలు..
అనంతరం వేలాదిమంది భక్తుల మధ్య రథం లాగుతున్న సమయంలో., కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా వెలిసిన స్వామివారి రథోత్సవం జరుగుతున్నప్పుడు కలశంపై అరటిపండ్లు విసిరే సాంప్రదాయాన్ని భక్తులకు కొనసాగించారు స్వామి వారిపై నమ్మకంతో అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఆచరించారు. ఎలాంటి అణచనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే ఈ కార్యక్రమంలో 150 మంది పోలీస్ భారీ బంధవస్తును ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా ఎక్కడలేని విధంగా అతిపెద్ద రథోత్సవం చూడడానికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆ తర్వాత ఆలయ కమిటీ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.