రైతుబంధు నిధుల జమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈసారి డబ్బులు అందని రైతులకు మే 8వ తేదీలోపు డబ్బులు జమ అందజేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల్లో 65 లక్షల మంది రైతులు ఇప్పటికే రైతుబంధు అందుకున్నారని తెలిపారు. ఈ నెల 9వ తేదీలోగా చివరి రైతుకు రైతుభరోసా నిధులు అందనివారికి చెల్లిస్తామన్నారు. కేవలం 4 లక్షల మందికి మాత్రమే అందలేదని ఆయన స్పష్టం చేసారు.
Also read: Tandur: తాండూరులో కన్నుల పండుగగా శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి వారి రథోత్సవం..
మే 9వ తేదీ వరకు రైతుబంధు వల్ల రాష్ట్రంలోని ఏ రైతుకూ బకాయిలు ఉండవని స్పష్టం చేశారు. రైతుబంధుకు నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ నేతల మాటలు నమ్మవద్దని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రుణమాఫీ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్ పాలనలో, పంట ఉత్పత్తికి అవసరమయ్యే పెట్టుబడుల కోసం రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందుకు గాను ఎకరాకు రూ. 5 వేలు అందించారు.
Also read: Wolf Man: ప్రపంచంలోని అత్యంత వెంట్రుకల కుటుంబం.. ఎక్కడో తెలుసా..
అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇదే స్కీమ్ ను “రైతు భరోసా” గా అమలు చేయాలని నిర్ణయించింది. అతి త్వరలో కొత్త మార్గదర్శకాలు కూడా రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఏటా హెక్టారుకు రూ. 15,000 పెట్టుబడి సాయం అందించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. అలాగే వ్యవసాయ కార్మికులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.