దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రాబోయే ఏడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను ఐఎండీ విడుదల చేసింది.
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ భారీ వర్షాలు కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Kolkata Doctor case: సీఎం మమతకు ప్రియాంకాగాంధీ కీలక సూచన
ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో వర్షాలు కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చిన్నారులు నీటి గుంటల్లో ఆడుకుంటూ మృతిచెందారు. అలాగే తెలంగాణలోని హైదరాబాద్‌లో కూడా సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.
(i) Isolated heavy rainfall likely to continue over Rajasthan, Uttar Pradesh, east & northeast India during next 7 days.
(ii) isolated heavy to very heavy rainfall very likely over Kerala, Tamil Nadu, South Interior Karnataka & Rayalaseema during next 5 days. pic.twitter.com/ZrrCzni9Tg— India Meteorological Department (@Indiametdept) August 12, 2024