వేసవి కాలంలో ఎండలు వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. వేసవిలో తాటి ముంజలు, మామిడి కాయలు, పుచ్చకాయలు కూడా వస్తాయి.. అయితే తాటి ముంజల కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు.. ఈ కాలంలో మాత్రమే అవి విరివిగా దొరుకుతాయి. అందుకే ఈ సీజన్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఇక తాటి ముంజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం..
ఈ తాటి ముంజల్లో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, సి,ఎ.విటమిన్లు, జింకు పాస్పరస్, పొటాషియం, ధయామిన్, రిబో ప్లేవిస్, నియాసిస్ వంటి బీ కాంప్లెక్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.. అందుకే వేసవిలో కొబ్బరి బొండంతో పాటు తాటి ముంజలను ఎక్కువగా తింటుంటారు.. ఇవి మృదువుగా తియ్యగా ఉండటం వల్ల పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు.. తాటి ముంజలను తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తాటి ముంజలను తినటం వలన అధిక రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాదు గుండె జబ్బులు కూడా దరిచేరవు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. డైట్ చేస్తున్నావారు వీటిని రోజూ తీసుకోవడం మంచిది.. డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి.. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందుకే ఈ సీజన్ లో వీటిని తినడం అసలు మిస్ అవ్వకండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.