Money Missing: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 88వేలకు పైగా కోట్లు గల్లంతయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ నుంచి అక్షరాల రూ.88,032.5 మిస్ అయ్యాయి. అవన్నీ కూడా రూ. 500 నోట్లే. ప్రింట్ అయ్యాయి.. కానీ ఆర్బీఐకి చేరలేదు. అసలేమయ్యాయి. అయితే మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన గణాంకాల ద్వారా ఈ విషయం బయటపడింది. అయితే ఇండియాలో కరెన్సీ నోట్లను ముద్రించే యూనిట్లు మూడు ఉన్నాయి. అందులో ఒకటి బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న బ్యాంక్ నోట్ ప్రెస్ ఉంది.
Read Also: Fake ChatGPT apps: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మొబైల్స్‌ని హ్యాక్ చేస్తున్నఫేక్ యాప్స్
ఈ మూడు మింట్‌లూ కొత్తగా డిజైన్ చేసిన రూ.500 నోట్లను 8,810.65 మిలియన్ల నోట్లను ముద్రించి సరఫరా చేశాయి. అయితే వీటిలో ఆర్బీఐకి చేరినవి 7,260 మిలియన్లు మాత్రమేనని మనోరంజన్ రాయ్ సమాచార హక్కు చట్టం కింద పొందిన గణాంకాలు చెబుతున్నాయి. అంటే రూ. 88,032.5 కోట్ల విలువైన 1,760.65 మిలియన్ల రూ.500 నోట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ గణాంకాల ప్రకారం.. 2016-2017లో నాసిక్ మింట్ 1,662 మిలియన్ నోట్లు, బెంగళూరు మింట్ 5,195.65 మిలియన్ నోట్లు, దేవాస్ మింట్ 1,953 మిలియన్ నోట్లను ఆర్‌బీఐకి సరఫరా చేసింది. మూడు మింట్‌ల నుంచి సరఫరా అయిన మొత్తం నోట్లు 8,810.65 మిలియన్లు. అయితే ఆర్బీఐకి అందినవి మాత్రం 7260 మిలియన్ నోట్లే.
Read Also: Aadhipurush : హనుమంతుని డైలాగ్స్ కు వచ్చే విమర్శలపై స్పందించిన రైటర్..!!
గల్లంతైన 1760.65 మిలియన్ నోట్లలో 210 మిలియన్ నోట్లు నాసిక్ మింట్‌లో 2015 ఏప్రిల్ – 2016 మార్చి మధ్య ముద్రితమయ్యాయి. ఆర్టీఐ ప్రకారం.. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఈ నోట్లు ఆర్బీకి సరఫరా అయ్యాయి. మరోవైపు కరెన్సీ నోట్ ప్రెస్‌లలో ప్రింట్ అయిన నోట్లు, ఆర్బీఐకి చేరిన నోట్లకు మధ్య వ్యత్యాసంపై విచారణ చేపట్టాలని సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లకు మనోరంజన్ రాయ్ లేఖలు కూడా రాశారు. అయితే కరెన్సీ నోట్ల ముద్రణ, సరఫరాలో భారీ లాజిస్టిక్స్ ప్రమేయం ఉన్నందున ఈ అసమతుల్యత సాధారణమే అని కొందరు సీనియర్ ఆర్‌బీఐ అధికారులు సమర్థించినట్లుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Read Also: Adipurush: ఆదిపురుష్‌పై ఆప్ వర్సెస్ బీజేపీ.. మనోభావాలు దెబ్బతీశాయని ఆరోపణ.
ఇటీవల ఆర్‌బిఐ వార్షిక నివేదికను విడుదల చేసింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2022-23లో కనుగొనబడిన ₹500 డినామినేషన్ నకిలీ నోట్ల సంఖ్య 14.4 శాతం పెరిగి 91,110 చేరుకుంది. అదే సమయంలో గుర్తించిన ₹2,000 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య ₹9,806 తగ్గిందని నివేదిక పేర్కొంది.