Aadhipurush : హనుమంతుని డైలాగ్స్ కు వచ్చే విమర్శలపై స్పందించిన రైటర్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిపురుష్ సినిమా విషయంలో ఊహించిన దానికంటే విమర్శలు ఎక్కువ అయ్యాయి.ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే రామ భక్తులంతా సినిమా చూసి బాగా మెచ్చుకుంటారు అనుకుంటే చాలామంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు అయితే కొందరు మాత్రం ఆదిపురుష్‌లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు అలాగే వాటికీ తగ్గట్టు వచ్చే డైలాగులను అస్సలు భరించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే డైలాగ్స్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో నిప్పు పెడతారు. ఆ సమయంలో హనుమాన్ ఇంద్రజిత్తుని తో . నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది దానికి రాసిన చమురు కూడా నీ బాబుది… నిప్పు కూడా నీ బాబుకే ఇస్తా అన్నట్లుగా ఓ డైలాగ్ ను చెబుతాడు. హనుమంతునికి మరీ ఇంత మాస్ డైలాగ్‌లు రాయడం అవసరమా అని నెట్టింట చర్చ కూడా జరుగుతోంది.
తాజాగా ఈ వివాదంపై ఆదిపురుష్ డైలాగ్ రచయిత మనోజ్ ముంతషీర్ స్పందించినట్లు సమాచారం.. ‘నావైపు నుంచి ఎటువంటి తప్పు కూడా లేదు. ఎంత గానో ఆలోచించినాకే హనుమంతుడి డైలాగ్స్ నేను రాశాను. సినిమాలో ఎన్నో పాత్రలున్నాయి. అందరూ కూడా ఒకేలా మాట్లాడరు కదా.. ఆ పాత్రల మధ్య వైవిధ్యం చూపించాలనే హనుమంతుడి భాషను సింపుల్‌గా ఉండేలా నేను జాగ్రత్తపడ్డాను. లంకా దహనం సమయంలోహనుమంతుడి చెప్పే డైలాగ్ గురించి అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.కానీ మనందరికీ రామాయణం ఎలా తెలుసు.. చిన్నప్పటి నుంచి రామాయణం గురించి కథలు కథలుగా చెప్తేనే కదా మనం తెలుసుకున్నాం. రామాయణంపై ఎన్నో గ్రంథాలు కూడా ఉన్నాయి. నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. నాకు మా నానమ్మ, అమ్మమ్మలు రామాయణ కథలను ఎంతో సింపుల్‌గా చెప్పేవారు. జానపద కళాకారులు కూడా హనుమంతుడి సంభాషణలను ఈ విధంగానే చెప్పేవారు. దానినే నేను ఆదిపురుష్‌లో వాడాను. అంతే కానీ నేనేమీ కొత్తగా డైలాగ్ ని అయితే సృష్టించలేదు’ అని ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!