ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 88వేలకు పైగా కోట్లు గల్లంతయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ నుంచి అక్షరాల రూ.88,032.5 మిస్ అయ్యాయి. అవన్నీ కూడా రూ. 500 నోట్లే. ప్రింట్ అయ్యాయి.. కానీ ఆర్బీఐకి చేరలేదు. అసలేమయ్యాయి. అయితే మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన గణాంకాల ద్వారా ఈ విషయం బయటపడింది.