ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి తరపున మోడీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈరోజు ఏపీలో పర్యటించిన ప్రధాని, ఈ నెల 8వ తేదీన విజయవాడకు రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాన రోడ్లలో సరుకు రవాణా వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. మరోవైపు.. రోడ్ షోలో పాల్గొనటం కోసం వచ్చే వారికి…
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఏపీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరి గన్నవరం చేరుకుంటారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి.. విశాఖ, విజయవాడ, ఏలూరు పర్యటనలకు వెళ్లనున్నారు.
కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకుంది. ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల బృందం పర్యటించనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకోగా.. వారికి విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, బెజవాడ సీపీ స్వాగతం పలికారు. అనంతరం.. సీఈఓ ఎంకే మీనాతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. రేపటి సమావేశం అజెండా అంశాలపై సమీక్ష నిర్వహించారు. సీఈసీ బృందం మూడ్రోజుల పర్యటనలో భాగంగా.. రాజకీయ పార్టీలు,…
విశాఖలో కేంద్ర సహాయ మంత్రి దేవ సింహ్ చౌహన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. సరైన సమయంల్లో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.
ఒకప్పుడు గ్రంథాలయం లేని ఊరు, పట్టణం వుండేదికాదు. కాలక్రమేణ టెక్నాలజీ పెరిగిందనే సాకుతో గ్రంథాలయాలు కనిపించకుండా పోతున్నాయి. విజయవాడలో రామ్మోహన గ్రంధాలయ సందర్శనకు వచ్చిన ఉప రాష్ట్రపతి తాజా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంధాలయం, దేవాలయం, సేవాలయం ప్రతీ ఊరిలో ఉండాలి. రోజులు మారాక గ్రంధాలయాలు కనపడటం లేదు. గతంలో రామ్మోహన గ్రంధాలయంలో ఉపన్యసించే వాడిని. పుస్తకం అందరి చేతిలో ఉండాలి. పుస్తకాలు చదవడం అందరూ అలవరుచుకోవాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్…
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది గతంలో ఎన్నడూ రీతిలో కేవలం 23సీట్లకే పరిమితమైంది. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయమే పట్టింది. ఇదే సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా చంద్రబాబు యాక్టివ్ గా పని చేసిన దాఖలాల్లేవు. ఏదో మొక్కుబడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకానీ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో…