Rajamouli Response to Negative Opinion on Baahubali: Crown of Blood: ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో ఈ కథలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ను గ్రాఫిక్ ఇండియా, అర్క మీడియా బ్యానర్స్ పై దర్శకుడు S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించగా..జీవన్ జె. కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ మే 17వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కాలికి గాయం?
ఈ రోజు మీడియా మిత్రులకు ఈ యానిమేషన్ సిరీస్ నుంచి రెండు ఎపిసోడ్స్ స్క్రీనింగ్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళిని మీడియా ప్రతినిధి ఒకరు ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత బాహుబలి లాంటి ఒక బ్లాక్ బస్టర్ బ్రాండ్ ని రాజమౌళి స్వయంగా కిల్ చేస్తున్నట్లు అనిపించింది. యానిమేషన్ లో ఉన్న ముఖాలు కానీ వాళ్ళ వాయిస్ లు కానీ అన్ని వేరేగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే బాహుబలి బ్రాండ్ లాగా అనిపించడం లేదు. స్వయంగా రాజమౌళి ఎందుకు కిల్ చేస్తున్నట్టు అని అందరికీ అనిపిస్తుంది దానికి మీరేం చెబుతారు?. అని అడిగితే రాజమౌళి తాను అలా అనుకోవడం లేదని అన్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ అని పేర్కొన్న రాజమౌళి మీరు ఇంకా ఫిలిం గ్లాసెస్ తోనే చూస్తున్నారు అనుకుంట యానిమేటెడ్ గ్లాసెస్ తో చూస్తే మీకు అలా అనిపించకపోవచ్చు అంటూ కామెంట్ చేశారు.